Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

శివనాంపల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ మృతి–కుటుంబ సభ్యులను పరామర్శించిన

Author
Posted By Telangana Vaartha
| 07 Nov 2026, 11:46 PM |
శివనాంపల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ మృతి–కుటుంబ సభ్యులను పరామర్శించిన

ముఖ్యమైన పాయింట్స్:

  • అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు.

జోగులాంబ గద్వాల 7 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గo, ఇటిక్యాల మండలం శివనాంపల్లి గ్రామ సర్పంచ్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద విషయం తెలుసుకున్న అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు స్వయంగా శివనాంపల్లి గ్రామానికి చేరుకుని, సర్పంచ్ లక్ష్మణ్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యం కల్పించారు.ఈ ఘటనతో శివనాంపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే వెంట బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.