Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

విధుల్లోనే కాదు.. సహోద్యోగి కష్టాల్లోనూ అండగా నిలిచిన సూర్యాపేట జిల్లా పోలీసులు

Author
Posted By Telangana Vaartha
| 07 Nov 2026, 07:59 PM | తాజావార్తలు Flash News
విధుల్లోనే కాదు.. సహోద్యోగి కష్టాల్లోనూ అండగా నిలిచిన సూర్యాపేట జిల్లా పోలీసులు

అనారోగ్యానికి గురైన హోంగార్డు బాలకృష్ణ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం
సహోద్యోగుల కష్టసుఖాల్లో ఒక కుటుంబంలా అండగా నిలవాలన్న జిల్లా ఎస్పీ గారి పిలుపుతో సూర్యాపేట జిల్లా పోలీసు సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై అనారోగ్యానికి గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్‌లోని ప్రముఖ గ్లెనీగిల్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసు సిబ్బంది, ఒక కుటుంబంలా ఏకమై తమ వంతు సహకారం అందించారు. అందరూ కలిసి సేకరించిన రూ.లక్ష నగదును చివ్వెంల ఎస్సై మహేశ్వర్ బాలకృష్ణ కుటుంబ సభ్యులకు అందజేశారు. సహోద్యోగి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవడం పోలీసు కుటుంబంలోని ఐక్యత, మానవత్వానికి నిదర్శనమని ఈ సందర్భంగా ఎస్పి నరసింహ గారు, పోలీసు అధికారులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పోలీసు సంఘం అధ్యక్షుడు రమేష్, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.