Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి..

Author
Posted By Telangana Vaartha
| 07 Nov 2026, 06:49 PM | తాజావార్తలు Flash News
చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి..

దీపాల కాంతులవలె ప్రతి ఇంటా వెలుగులు నిండాలి..
బాణాసంచా పేల్చేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి..
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు..
మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి..

చీకటిని పారద్రోలే వెలుగుల పండుగ దీపావళి అని.. దీపాల కాంతులవలె తెలంగాణలోని ప్రతి ఇంటా వెలుగులతో నిండాలిని ఆకాంక్షిస్తూ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరికీ మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.. చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళి పండుగను జరుపుకుంటామని.. నరకాసుర వదతో దీపావళి పండుగ జరిగినట్లు.. మన తెలంగాణ లోనూ చీకట్లు తొలగి మళ్లీ అభివృద్ధితో వెల్లివిరియాలన్నారు. అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి బంగారు తెలంగాణ సాధనలో నూతనోత్తేజంతో ముందడుగు వేయాలన్నారు. అలాగే బాణసంచా పేల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పూజలకు ప్రత్యేకమైన కార్తీక మాసంలో చేసే పూజలు ఫలించాలని ఆయన ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ దీపాలు శుభాకాంక్షలు తెలిపారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.