Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఖమ్మంలో ఘనంగా జిల్లా స్థాయి గో విజ్ఞాన్ పరీక్ష

Author
Posted By Telangana Vaartha
| 07 Nov 2026, 06:39 PM |
ఖమ్మంలో ఘనంగా జిల్లా స్థాయి గో విజ్ఞాన్ పరీక్ష

ముఖ్యమైన పాయింట్స్:

  • 210 మంది విద్యార్థుల ఉత్సాహభరితంగా పాల్గొన్నారు

ఖమ్మం:- గోసేవ తెలంగాణ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా స్థాయి గో విజ్ఞాన్ పరీక్ష–2026 గుట్టల బజార్‌లోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు . ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్షకు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 210 మంది విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు . విద్యార్థుల్లో గోవుల పట్ల జ్ఞానం , అవగాహన , సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు భారతీయ సంస్కృతి , సంప్రదాయాలను భావితరాలకు అందించడమే పరీక్ష ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు . 'నాలెడ్జ్ , కల్చర్ , బెటర్ టుమారో' నినాదంతో ఈ పరీక్షను నిర్వహించినట్లు పేర్కొన్నారు . పాఠశాల స్థాయిలో ఎంపికైన ప్రతిభావంతులైన విద్యార్థులకు మాత్రమే జిల్లా స్థాయి పరీక్షలో పాల్గొనే అవకాశం కల్పించారు . ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పరీక్షకు ఎంపిక కానున్నారు . రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన వారికి వరుసగా రూ.లక్ష, రూ.50 వేలు , రూ.25 వేల నగదు బహుమతులతో పాటు కన్సొలేషన్ బహుమతులు అందజేయనున్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆకుతోట రామారావు , ఎకో క్లబ్ ఎన్విరాన్‌మెంటల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు , ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ కడవెండి వేణుగోపాల్ హాజరయ్యారు . ఖమ్మం గోసేవ విభాగం ప్రతినిధులు బండి చైతన్య కిషోర్ , కొండకింది వేణుగోపాల్ , విహే జాయింట్ సెక్రటరీ జయంత్ పటేల్‌తో పాటు జిల్లాలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు . పరీక్ష విజయవంతానికి సహకరించిన పాఠశాల యాజమాన్యాలు , ఉపాధ్యాయులు , విద్యార్థులు , తల్లిదండ్రులకు గోసేవ తెలంగాణ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు . ఆరోగ్యవంతమైన గోవులు – ఆరోగ్యవంతమైన సమాజం లక్ష్యంతో గోసేవ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని వారు పేర్కొన్నారు .

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.