Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సమావేశం ఫ్లెక్సీలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఫోటో గల్లంతు!

Author
Posted By Telangana Vaartha
| 06 Nov 2026, 05:24 PM |
సమావేశం ఫ్లెక్సీలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఫోటో గల్లంతు!

- కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారిన వైనం
సూర్యాపేట, నవంబర్ 06 :-
పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. స్వర్గీయ రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా, సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా కొప్పుల వేణారెడ్డికి జిల్లా కేంద్రంలో, ప్రజల్లో, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి నాయకుడి ఫోటో సమావేశ ఫ్లెక్సీలో లేకపోవడంపై సమావేశానికి హాజరైన కార్యకర్తలు, అభిమానులు, ముఖ్య నాయకులు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సమావేశం ప్రారంభంలోనే ఈ అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. నిర్వాహకుల పొరపాటా.. లేక కావాలనే ఫోటో పెట్టలేదా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.