Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సూర్యాపేటలో కోహాన్స్ ఫార్మా కంపెనీకి PCB షాక్

Author
Posted By Telangana Vaartha
| 05 Nov 2026, 11:15 PM |
సూర్యాపేటలో కోహాన్స్ ఫార్మా కంపెనీకి PCB షాక్

పరిశ్రమ మూసివేతకు ఆదేశాలు… పవర్ కట్, వాటర్ కట్ దిశగా కీలక చర్యలు......
సూర్యాపేట జిల్లాలోని ఫార్మా కంపెనీపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కొరడా ఝళిపించింది....
దాసాయిగూడెం గ్రామ పరిధిలో ఉన్న కోహాన్స్, గతంలో సువెన్ ఫార్మాస్యూటికల్స్‌గా కొనసాగిన ఈ కంపెనీపై PCB తీవ్ర చర్యలకు దిగింది......
ఇటీవల కంపెనీలో క్లోరోఫామ్ లీకేజీ ఘటన చోటుచేసుకుని ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు బోర్డు ఉత్తర్వుల్లో పేర్కొంది......
ప్రొడక్షన్ బ్లాక్ నంబర్ 2లో జరిగిన ఈ ఘటన పరిశ్రమ భద్రతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది....
కంపెనీపై స్థానిక ప్రజల నుంచి పలుమార్లు ఫిర్యాదులు అందినట్లు PCB ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.....
కాలుష్య సమస్యలు, పరిశ్రమ నిర్వహణపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు....
నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో పరిశ్రమను మూసివేయాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది........

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.