Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

హర్యానా: చిన్నారిపై దాడి కేసులో 8 ఏళ్ల బాలుడికి బెయిల్

Author
Posted By Telangana Vaartha
| 05 Nov 2026, 07:42 PM | తాజావార్తలు Flash News
హర్యానా: చిన్నారిపై దాడి కేసులో 8 ఏళ్ల బాలుడికి బెయిల్

హర్యానాలో 6 ఏళ్ల చిన్నారిపై పాఠశాల తరగతి గదిలో దాడి చేసిన ఘటనలో 8 ఏళ్ల బాలుడికి జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. తరగతి గదిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఆ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని అధికారులను బోర్డు ఆదేశించింది. బాలుడు ఎక్కువ రోజులు కస్టడీలో ఉంటే అతడి చదువు, ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని అతడి తల్లిదండ్రులు బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. కౌన్సెలింగ్ ఇప్పిస్తామని, అవసరమైనప్పుడల్లా బోర్డు ఎదుట హాజరుపరుస్తామని చెప్పడంతో కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.