Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఘనంగా ఏ టు జెడ్ ఏజెన్సీ ప్రారంభోత్సవం

Author
Posted By Telangana Vaartha
| 05 Nov 2026, 03:08 AM |
ఘనంగా ఏ టు జెడ్ ఏజెన్సీ ప్రారంభోత్సవం

ఖమ్మం, నవంబర్ 4:- ఖమ్మం నగరంలోని బోనకల్లు రోడ్డులో సెయింట్ మేరీస్ స్కూల్ పక్కన, పోలియో హోం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఏ టు జెడ్ ఏజెన్సీ కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన 24వ డివిజన్ మాజీ కార్పొరేటర్, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి రిబ్బన్ కట్ చేసి ఏజెన్సీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏజెన్సీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు కొత్త సీతారాములు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని నిర్వాహకులు పాల్వంచ కృష్ణకు అభినందనలు తెలిపారు. అనంతరం ఏజెన్సీ నిర్వాహకులు పాల్వంచ కృష్ణ మాట్లాడుతూ, ప్రారంభోత్సవానికి విచ్చేసి తమను ఆశీర్వదించిన అతిథులు, పెద్దలు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.