Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

మున్సిపల్ పరిధిలోని పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి – చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి

Author
Posted By Telangana Vaartha
| 04 Nov 2026, 07:03 PM | తాజావార్తలు Flash News
మున్సిపల్ పరిధిలోని పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి – చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి

మహబూబాబాద్:మున్సిపల్ పరిధిలో నివాసం ఉంటున్న పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలని, ఈ నెల 6న హైదరాబాద్‌లోని CRD కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోడిశాల వెంకన్న పిలుపునిచ్చారు.

వ్యవసాయ కార్మిక సంఘం కేసముద్రం మండల కమిటీ సమావేశం సగ్గురం కవిత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గోడిశాల వెంకన్న మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న ఉపాధి హామీ పథకాన్ని పట్టణ, మున్సిపల్ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

పట్టణాల్లో నివసిస్తున్న నిరుపేదలకు సరైన ఉపాధి అవకాశాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులపై ఆధారపడి జీవిస్తున్న పేదలకు సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని, రోజుకు రూ.800 కూలీ చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని, పేదల ఉపాధి హక్కును కాపాడాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం నవంబర్ 6న హైదరాబాద్‌లోని CRD కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాకు వ్యవసాయ కార్మికులు, పేదలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.