Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 03 Nov 2026, 08:20 PM | తెలంగాణ Telangana
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

నాగారం 03 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట–జనగాం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన సంఘటన ఫణిగిరి స్టేజి సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మండల పరిధిలోని ఫణిగిరి గ్రామానికి చెందిన పామనగుండ్ల శ్రీను అనే వ్యక్తి తన వ్యక్తిగత పనిమీద తిరుమలగిరి వెళ్లి తిరిగి ఫణిగిరి గ్రామానికి బైక్‌పై వస్తున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన కొమిరె శోభన్‌ అనే వ్యక్తి తన ట్రాక్టర్‌తో తిరుమలగిరి వైపు వెళుతున్న క్రమంలో ఫణిగిరి స్టేజీ సమీపంలో శ్రీను బైక్‌ను ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు శ్రీనుకు మొఖానికి గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు జరపనున్నట్లు ఏఎస్‌ఐ భగవాన్‌ నాయక్‌ తెలిపారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.