Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

గానుగబండలో IKP కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

Author
Posted By Telangana Vaartha
| 05 Oct 2026, 11:23 PM |
గానుగబండలో IKP కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి

సూర్యాపేట/తుంగతుర్తి:- తుంగతుర్తి నియోజకవర్గంలోని గానుగబండ గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు తమ గ్రామానికి IKP ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటాయించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. గతంలో IKP కేంద్రానికి సంబంధించిన కొన్ని లావాదేవీల విషయంలో వివాదాలు చోటుచేసుకున్నాయని, ప్రస్తుతం కొంతమంది రాజకీయపరంగా తమను ఇబ్బందులకు గురిచేస్తూ కేంద్రం నిర్వహణకు అడ్డంకులు కల్పిస్తున్నారని మహిళలు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారిదృష్టికి తీసుకెళ్లారు. అలాగే గతంలో IKP కేంద్రం వద్ద జరిగిన వ్యవహారాలపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించి, సమగ్రంగా విచారణ జరిపించాలని, అవసరమైతే CBI ద్వారా విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాల సభ్యులు కోరారు. గౌరవ కలెక్టర్ ని సందర్భంగా విన్నవించుకున్నారు రైతులు, మహిళా సంఘాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గానుగబండలో IKP కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

గానుగబండలో IKP కేంద్రం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.