Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్రజావాణి అర్జీలను పెండింగ్ లేకుండా చూడాలి

Author
Posted By Telangana Vaartha
| 05 Oct 2026, 07:45 PM |
ప్రజావాణి అర్జీలను పెండింగ్ లేకుండా చూడాలి

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
గద్వాల. ప్రజావాణి ఆర్జీలను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా ఐడిఓసి సమావేశపు మందిరంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావుతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ వారం మొత్తం 44 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వివిధ శాఖలకు సంబంధించి జిల్లా ప్రజావాణికి వచ్చిన మొత్తం 94 ఆర్జీలు పెండింగ్ లో ఉన్నాయని వీటిని పరిష్కరించాలని ఆదేశించారు. మండల స్థాయి ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను కూడా సంబంధిత శాఖల అధికారులు తమ సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహించి సకాలంలో పరిష్కరించేలా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.