జిల్లాలో ఇసుక నిర్వహణ పారదర్శకంగా చేపట్టాలి
నదుల్లో నీటి మట్టం తక్కువగా ఉన్నందున ఇసుక తవ్వకాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు తుమ్మిళ్ల ఇసుక రీచ్ నిర్వహణ పక్కాగా ఉండాలి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జోగులాంబ గద్వాల 18 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లాలో ఇసుక నిర్వహణను పారదర్శకంగా చేపట్టడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా స్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,జిల్లాలో ఇసుక నిర్వహణను...