ఓటరు జాబితా రూపకల్పనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
పట్టభద్రుల ఓటరు జాబితా తయారీ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అధికారులు. జోగులాంబ గద్వాల 18 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల ఓటరు జాబితా డి-నోవో (కొత్తగా) రూపకల్పన ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ జిల్లా అధికారులకు సూచించారు. పట్టభద్రుల ఓటరు జాబితా డి-నోవో రూపకల్పనలో ఇప్పటివరకు సాధించిన పురోగతిపై బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లాల...