సైబర్ మోసాల బాధితులకు సత్వర సేవలు.
- సైబర్ మోసాలకు గురైన బాధితులు కోల్పోయిన నగదును తిరిగి రాబట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి. - సైబర్ వారియర్స్, స్థానిక పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. - సైబర్ నేరాల పట్ల ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలి. - సైబర్ నేరాల నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ అమలు : జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. సైబర్ మోసాలకు గురైన బాధితులకు సత్వర సేవలు అందించడంతో పాటు, ప్రజలు, వినియోగదారులు సైబర్ నేరగాళ్ల బారినపడి ఆర్థికంగా నష్టపోకుండా సైబర్ వారియర్స్, స్థానిక పోలీస్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూచించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్...