రూ.70 లక్షలు బ్యాంకులో ఉన్నా.. వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయాడు!

పదేళ్ల పాటు ఉద్యోగం చేసి సంపాదించిన ప్రతి రూపాయిని దాచుకున్నాడు. కనీసం తన జీతంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా బ్యాంకులో ఏకంగా రూ.70 లక్షలు జమ చేశాడు. పెళ్లి చేసుకుంటే భార్య తన డబ్బును తీసుకెళ్తుందనే భయంతో జీవితాంతం పెళ్లికి కూడా దూరంగా ఉన్నాడు. కానీ విధి మరోలా నిర్ణయించింది. చివరకు టీబీ (క్షయ) వ్యాధి బారిన పడినా.. చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందనే భయంతో వైద్యానికి దూరంగా ఉన్నాడు. చేతిలో డబ్బు.. బ్యాంకులో భారీ మొత్తంలో పొదుపు ఉన్నా, వాటిని తన అవసరాలకు ఉపయోగించుకోలేక చివరకు ప్రాణాలు కోల్పోయాడు. డబ్బు సంపాదించడం జీవితంలో ఒక భాగమే.. కానీ ఆ...