ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై సర్పంచులకు డీలర్లకు అవగాహన కార్యక్రమం.

ఇందిరమ్మ జీవిత బీమా పథకం పథకంపై సర్పంచులకు డీలర్లకు అవగాహన కార్యక్రమం. రేషన్ షాపుల వారీగా లబ్ధిదారుల గుర్తింపు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలి. డి డబ్ల్యు ఓ మండల ప్రత్యేక అధికారి సునంద. జోగులాంబ గద్వాల 17 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో అధ్యక్షతన మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులకు డీలర్లకు ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ &మండల ప్రత్యేక అధికారి సునంద హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత...