గంజాయి సేవించిన ముగ్గురికి వైద్య పరీక్షల్లో పాజిటివ్.. డీ

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు చేపడుతున్నారు. ఇల్లందు డీఎస్పీ యు వెంకన్నబాబు మార్గనిర్దేశం లొ ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించగా, ముగ్గురికీ గంజాయి సేవించినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. వైద్య పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యల్లో భాగంగా ముగ్గురినీ ఇల్లందు మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం వారిని భద్రాచలంలోని డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఇల్లందు సీఐ సురేష్ మాట్లాడుతూ, గంజాయి వంటి మత్తు...