నిజమైన సాధకుడు

ఒకసారి ఒక సాధువు, మరొక సాధకుడు కలిసి ఏదో ఒక ప్రదేశానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో వారికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. అతనికి ఆ సాధకుడు ముందే పరిచయం. అయితే, ఆ సాధకుడిని చూడగానే అతడు దుర్భాషలాడటం ప్రారంభించాడు. ఇది గమనించిన సాధువు ఆశ్చర్యపోయి, ఆ వ్యక్తితో ఇలా అన్నారు. “సోదరా! మీరు ఎందుకు ఇంత అసభ్యకరమైన భాషలో తిడుతున్నారు? ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల మీ నోరు అపవిత్రం చేసుకుంటున్నారు కదా!” అని హితవు పలికారు. సాధువు మాటలు విన్న సాధకుడికి ధైర్యం వచ్చింది. వెంటనే అతడు కూడా ఆ వ్యక్తిని తిరిగి దుర్భాషలాడటం ప్రారంభించాడు. అలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ...