జీవిత బీమా పథకం అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు
రేషన్ షాపుల వారీగా లబ్ధిదారుల గుర్తింపు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జోగులంబ గద్వాల 17 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ప్రత్యేక శిబిరాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఇతర అధికారులతో పథకం అమలు సన్నద్ధతపై జిల్లా...