ప్రజావాణి కార్యక్రమంలో 11 ఫిర్యాదులు స్వీకరణ : జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె. శంకర్
జోగులాంబ గద్వాల 16 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. ప్రజల నుండి స్వీకరించిన పిర్యాదుల పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు ఎస్పీ శ్రీ కె. శంకర్ అన్నారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 11 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీస్ అధికారులు,...