ఆరుతడి పంటల సాగుతో అధిక లాభాలు పొందాలి
మండల వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్. రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకొని అధిక లాభాలను పొందాలని మండల వ్యవసాయ అధికారి సురేష్ గౌడ్ సూచించారు. సోమవారం ఎర్రవల్లి మండలం తిమ్మాపూర్ గ్రామంలో పొలం బడి కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సమగ్ర వ్యవసాయ విధానాలను పాటిస్తూ, శాస్త్రవేత్తల సూచనలు మరియు ఆధునిక వ్యవసాయ మెలకువలను అనుసరించాలని కోరారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉండటంతో బోర్లలో నీటిమట్టం తగ్గిపోయిందని, బావుల్లో కూడా నీటి లభ్యత తక్కువగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాబోయే యాసంగి సీజన్లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ...