కుట్కనూరు ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలి.. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం
సానుకూలంగా స్పందించి త్వరలోనే ప్రభుత్వ టీచర్ లేదా విద్యా వాలంటీర్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ. జోగులాంబ గద్వాల నవంబర్ 16 తెలంగాణ వార్తా ప్రతినిధి. అయిజ. మండలం కుట్కనూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నెలకొన్న తీవ్ర ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలని కోరుతూ కుట్కనూరు మాజీ సర్పంచ్ బెంజిమెన్ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో రెండు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు (పాత మరియు కొత్త పాఠశాలలు) ఉన్నాయని, పాత పాఠశాలలో 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు, కొత్త పాఠశాలలో 25 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు కేటాయించబడి ఉన్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. అయితే, కొత్త...