ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం

గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలు ఏర్పాటు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలి. విబి జిరాంజీలో జలసిరి పనులను పెద్ద ఎత్తున చేపట్టాలి. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జోగులాంబ గద్వాల నవంబర్ 16 తెలంగాణ వార్తప్రతినిధి. గద్వాల. ప్రతి కుటుంబానికి జీవిత బీమా భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈనెల 19న ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. సోమవారం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విధివిధానాలు, అమలు, నమోదు ప్రక్రియ, విబి జిరాంజీ పనులు, రబీ...