ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత.. ఇద్దరితోనే 80 మంది విద్యార్థులకు బోధన

ఉపాధ్యాయులను వెంటనే నియమించాలి.. కలెక్టర్‌ను ఆశ్రయించిన విద్యార్థులు, తల్లిదండ్రులు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని కురవపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నాయి. 8వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 80 మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులే విద్యాబోధన చేస్తున్నారు. గతంలో 150 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు విద్యాశాఖ అధికారులకు విన్నవించినా పరిష్కారం చూపకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. దీంతో సోమవారం నిర్వహించిన పిల్లల ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి...