పొలంలో రైతు కష్టం...! మార్కెట్లో వ్యాపారుల ఇష్టం
రైతు చెమట చుక్కలో సమాజపు బతుకు..!*ప్రాణం నిలవాలంటే కావాలి అన్నపు మెతుకు...! రైతు కన్నీటి చుక్కలో వ్యవస్థ తప్పులు వెతుకు...! మిల్లర్ల, వ్యాపారుల సిండికేట్ రాజ్యంలో రైతన్నల బతుకు చితుకు...!!! కంట నీరే పంట నీరుగా బురద నుంచి బువ్వను తీసిన రైతన్నలు...! విత్తనం దగ్గర అప్పు... రైతన్న జీవితాలకు ముప్పు... రైతు బాధలు తీర్చే వారెవరు చెప్పు...! రైతుల బతుకులే నివురు గప్పిన నిప్పు..!!! పంట దగ్గర ఆశ...అమ్మకం దగ్గర నిరాశ...!!! అన్నం విలువ తెలిసిన సమాజానికి... అన్నదాత కన్నీటి విలువ తెలియకపోవటం సిగ్గుచేటు...!! ✍️ డాక్టర్ కృష్ణ బంటు, పీహెచ్డీ& గోల్డ్ మెడలిస్ట్ ఇన్ జర్నలిజం, సీనియర్ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్, రాష్ట్ర...