ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి

డిమాండ్లు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్ హెచ్చరిక సూర్యాపేట: ఆశా వర్కర్లకు కనీసం రూ.18 వేల వేతనం అమలు చేయాలని, వారి న్యాయమైన హక్కులను వెంటనే కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో నేడు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట సుమారు 200 మంది ఆశా వర్కర్లతో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మేకల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, కార్మిక హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం...