బహుజన రాజ్యాధికారంతోనే సామాజిక న్యాయం: మహంకాళి బిక్షపతి
గుండాల 15 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక గుండాల మండల కేంద్రంలో నిర్వహించిన 125వ జ్ఞానమాల కార్యక్రమంలో మహంకాళి బిక్షపతి మాట్లాడుతూ.. సమాజంలో నెలకొన్న దోపిడీ, అన్యాయాలు, అక్రమాలను రూపుమాపేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగంలో సమానత్వం ఉన్నప్పటికీ, ఆచరణలో సమాజంలో అది పూర్తిగా అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "చదువు - సమీకరించు - పోరాడు" అనే నినాదంతో ముందుకు సాగుతూ, బహుజన రాజ్యాధికారం సాధించినప్పుడే అణగారిన వర్గాల సంక్షేమం, దళితుల అభ్యున్నతి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. డాక్టర్...