ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రీ ఫైనల్ మాక్ టెస్ట్ నిర్వహణ.

అవగాహన పెరగడంతో పాటు, సామర్థ్యాన్ని అంచనా వేసుకుని అసలైన పరీక్షలో తప్పులు జరగకుండా చూసుకోవడానికి అవకాశం. ఒత్తిడి తగ్గించుకొని ఆత్మవిశ్వాసంతో;పరీక్షలు రాయాలి – ఎస్పీ కె. నరసింహ. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు సూర్యాపేట జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట, కోదాడ పట్టణాల్లో 400 మంది అభ్యర్థులకు అందిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం సూర్యాపేట పట్టణంలోని చుక్కా రామయ్య పాఠశాలలో, కోదాడ పట్టణంలో కెఆర్ఆర్ కళాశాలలో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌కు సంబంధించి ప్రీ ఫైనల్ మాక్ టెస్ట్ నిర్వహించారు. మొత్తం 497 మంది అభ్యర్థులు హాజరైనారు. ఈ పరీక్షను హైదరాబాద్‌కు చెందిన ఐరైజ్ (iRise) ఇన్‌స్టిట్యూట్ సంయుక్త...