డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజుకు నారంశెట్టి జాతీయ బాలసాహిత్య పురస్కారం

డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజుకు నారంశెట్టి జాతీయ బాలసాహిత్య పురస్కారం వెంకటాపురం-నూగూరు, నవంబర్ 14(తెలంగాణవార్త): ములుగు జిల్లా వాజేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు ఉపన్యాసకులు, ప్రముఖ బాలసాహితీవేత్త డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజుకు 2026 సంవత్సరానికి గాను నారంశెట్టి జాతీయస్థాయి బాలసాహిత్య పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్లోని మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన నారంశెట్టి బాలసాహిత్య పీఠం ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు బాలసాహితీవేత్తలకు జాతీయస్థాయి పురస్కారాలను అందిస్తోంది. ఇందులో భాగంగా 2026 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం నుంచి డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజును ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు పీఠం ప్రతినిధులు ప్రకటించారు. వచ్చే నెల డిసెంబరులో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో పురస్కార గ్రహీతకు రూ.6...