ఘనంగా ఖమ్మం జోన్ స్థాయి నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు
క్రీడలతో ఆరోగ్యం, క్రమశిక్షణ, సమిష్టి తత్వం – ఖమ్మం ఏ.జి.ఏం రాంకీ ఖమ్మం:- నేడు ఖమ్మంలోని సర్దార్ వల్లభభాయ్ స్టేడియంలో నిర్వహించిన నారాయణ ప్రీమియర్ లీగ్ ఖమ్మం జోన్ స్థాయి క్రీడా పోటీల్లో నారాయణ స్కూల్స్ సత్తుపల్లి, ఖమ్మం, పాల్వంచ బ్రాంచ్ల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించడం విశేషం. ఈ క్రీడా వేడుకలు వివిధ బ్రాంచ్ల విద్యార్థుల మార్చ్ఫాస్ట్, అతిధుల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం ఏ.జి.ఏం రాంకీ, విశిష్ట అతిథులుగా హెచ్ ఆర్ సతీష్, శ్రీకాంత్, ఆర్ఐ క్రాంతి హాజరయ్యారు....