ఖమ్మం ఖ్యాతిని రాష్ట్రస్థాయికి చాటిన లీల ప్రసన్న

మిస్ తెలంగాణ-2026, మిస్ ఖమ్మం-2026 కిరీటాలు కైవసం.. ఖమ్మం:- అందం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, పోరాట పటిమకు ప్రతీకగా నిలుస్తూ ఖమ్మం నగరానికి చెందిన కొత్త లీల ప్రసన్న అరుదైన విజయాలను సొంతం చేసుకున్నారు. ఇటీవలే వరంగల్‌లో తెలంగాణ ఫ్యాషన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో గౌస్ పాషా నేతృత్వంలో నిర్వహించిన మిస్ తెలంగాణ స్పార్క్–2026 పోటీల్లో విజేతగా నిలిచి మిస్ తెలంగాణ–2026, మిస్ ఖమ్మం–2026 అనే రెండు ప్రతిష్ఠాత్మక కిరీటాలను దక్కించుకున్నారు. కేవలం అందాల పోటీలకే పరిమితం కాకుండా క్రీడారంగంలోనూ తన సత్తా చాటుతున్న లీల ప్రసన్న కరాటేలో బ్లాక్ బెల్ట్ రెండో డాన్ సాధించడంతో పాటు రాష్ట్రస్థాయి గ్రాండ్ ఛాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకున్నారు. ఇప్పటివరకు సుమారు 40...