ద్విచక్ర వాహనంపై ఐదుగురు ప్రయాణం..

ముఖ్యమైన పాయింట్స్:విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం – సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డి సూర్యాపేట పట్టణంలో ద్విచక్ర వాహనంపై ఐదుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వారిని ఆపి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డి విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఒకే ద్విచక్ర వాహనంపై పరిమితికి మించి ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని, ఇలాంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల వాహనదారులతో పాటు రహదారిపై ప్రయాణించే ఇతరులు కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని...