దళిత హక్కుల పోరాట సమితి 20వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి
సామాజిక న్యాయ సాధనకు ఐక్యంగా పోరాడుదాం – ప్రతి యువకుడికి సమాన అవకాశాలు కల్పిద్దాం సూర్యాపేట: దళిత హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయ సాధన, సమానత్వ సమాజ నిర్మాణమే లక్ష్యంగా దళిత హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న 20వ వార్షికోత్సవాలను ఈ నెల 29,30 న ఘనంగా హైదరాబాదులో నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కే. ఏసురత్నం పిలుపునిచ్చారు.శనివారం జిల్లా కేంద్రంలో ధర్మ బిక్షం భవనంలో దళిత హక్కుల పోరాట సమితి కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో నేటికీ కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలు కొనసాగడం ఆందోళనకరమన్నారు....