జయ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..
సూర్యాపేట:- జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని జయ పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు వివిధ జాతీయ నాయకులు, దేవతామూర్తుల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారులు జవహర్లాల్ నెహ్రూ, భారతమాత, తెలంగాణ తల్లి తదితరుల వేషధారణలో ముస్తాబై వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జయ శేణుగోపాల్, డైరెక్టర్లు జెట్ల పద్మ, బింగి జ్యోతి పాల్గొని విద్యార్థులను అభినందించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తమ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.