అన్నదాత కడుపు కొడుతున్న దళారీ దందా..
మాచారం గౌరీ శంకర్ రైస్ మిల్లు ఎదుట బాధిత రైతు కన్నెర్ర మాట మార్చి తక్కువ ధర చెల్లింపు.. కటింగ్ల పేరుతో అదనపు దోపిడీ ఆరోపణలు యంత్రాంగం తక్షణమే స్పందించి మిల్లుపై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ పెన్పహాడ్, నవంబర్ 15:- ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి వెళ్లిన రైతుకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు పెన్పహాడ్ మండలంలో కలకలం రేపుతున్నాయి. మాచారం గ్రామ శివారులోని గౌరీ శంకర్ రైస్ మిల్లులో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, గుడిబండ తండాకు చెందిన భూక్య వీరేందర్ నాయక్ అనే రైతు శనివారం మిల్లు ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధిత రైతు విలేకరులతో...