ఆర్టీఐ దరఖాస్తులంటే అధికారులకు లెక్కలేదా
నెల రోజులైనా సమాచారం ఇవ్వని అధికారులు.. దరఖాస్తునే తిరిగి పంపిన కలెక్టర్ కార్యాలయం! జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి.. నిర్లక్ష్య అధికారులపై చర్యలు తీసుకోవాలి ఆర్టీఐ చట్టంపై అధికారులకు అవగాహన కల్పించాలి సామాజిక కార్యకర్త హెచ్.శాంతన్న జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన సామాజిక ఆర్ టీ ఐ కార్యకర్త శాంతన్న గారు ప్రజలకు ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సమాచార హక్కు చట్టం–2005 అమలులోనే అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని సామాజిక ఆర్టీఐ కార్యకర్త హెచ్.శాంతన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ధనంతో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి ఖర్చుల వివరాలు అడిగితే...