తల్లిని ఇంట్లో నుండి గెంటేసిన కుమారులు
వయోవృద్ధుల దినోత్సవం రోజే తల్లికి అవమానం సూర్యాపేట: వయోవృద్ధుల దినోత్సవం రోజే ఓ తల్లికి తీరని అవమానం జరిగింది. పిల్లలను అల్లారు ముద్దుగా పెంచి, పెద్ద చేసి పెళ్లిళ్లు చేసిన తల్లికి చివరకు వీధిన పడే పరిస్థితి వచ్చింది. సూర్యాపేట జిల్లా కేంద్రం 15వ వార్డుకు చెందిన తాడూరి నర్సమ్మ, చంద్రయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వీరికి సొంత ఇల్లు కూడా లేదు. 9 సంవత్సరాల క్రితం చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుండి కుమారుల ఇళ్లలోనే ఉంటున్న నర్సమ్మను శుక్రవారం ఇంటి నుండి గెంటేసినట్లు బాధితురాలు తెలిపారు. వీధిన పడిన నర్సమ్మను చూసి స్థానికులు...