వరికి బదులు మరో పంట వేద్దామ? యాసంగిలో ఏ పంట లాభదాయకం?
బోరులో నీళ్లున్నాయని వరి వేస్తే ముప్పేనా? ప్రత్యామ్నాయ పంటలతో రైతుకు ఆదాయం వస్తుందా? నీటి లభ్యత.. కోతుల బెడద.. మార్కెట్ ధరలు.. పెట్టుబడి ఖర్చులు – సాగు నిర్ణయానికి ఇవే కీలకం! యాసంగి సాగు ప్రారంభమవుతున్న వేళ తెలంగాణ రైతుల ముందున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే.. ఏ పంట వేస్తే లాభం వస్తుంది? ప్రస్తుతం బోరులో నీళ్లు వస్తున్నాయని వరి సాగు చేపడితే మార్చి, ఏప్రిల్ నెలల్లోనూ అదే పరిస్థితి ఉంటుందా? వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు సాగు చేద్దామంటే కోతులు, అడవి పందుల బెడద. పంటను కాపాడుకున్నా మార్కెట్లో సరైన ధర వస్తుందన్న నమ్మకం లేదు. ఈ సందిగ్ధంలో రైతు తీసుకునే నిర్ణయం కుటుంబ...