తూకంలో దళారుల మాయాజాలం రైతుల నిఘాతో బయటపడ్డ మోసం

వాహనాలను అడ్డుకుని ఆందోళన.. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం పూడూరు గ్రామంలో పత్తి కొనుగోళ్లలో దళారుల భారీ మోసం వెలుగులోకి వచ్చింది. తూకంలో వ్యత్యాసం చూపి రైతులను నిలువునా ముంచే ప్రయత్నం చేసిన దళారులను బాధిత రైతులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీశారు. అసలేం జరిగింది?.. పూడూరు గ్రామానికి చెందిన సుమారు 25 నుండి 30 మంది రైతులు తమ పంటను స్థానిక దళారులకు విక్రయించారు. అయితే, బయట వేబ్రిడ్జిపై తూకం వేసిన బరువుకు, దళారుల కాంటాకు మధ్య భారీ తేడా రావడంతో రైతులు అవాక్కయ్యారు. ఒక రైతు పత్తి బయట 66 క్వింటాళ్లు తూకం రాగా, దళారీ వద్దకు వచ్చేసరికి కేవలం 38...