బాల సదనంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

జోగులాంబ గద్వాల 13 నవంబర్ 20 26 తెలంగాణ వార్త ప్రతినిధి.గద్వాల. : మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గద్వాల ప్రభుత్వ బాల సదనంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిష్క పాత్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి బాలల దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలలు నిర్వహించిన ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులతో ముఖ్య అతిథి ఆప్యాయంగా ముచ్చటించి వారితో కొంత సమయం గడిపారు. ఈ కార్యక్రమంలో పి ఓ ఐ సి ఇన్‌చార్జ్...