ఇనాం భూమిలో అక్రమ ప్లాట్ల దందా.. తహశీల్దార్‌కు ఫిర్యాదు

ఉప్పల గ్రామ సర్వే నెంబర్ 28/అ1 లోని దేవాదాయ శాఖ ఇనాం భూమిలో అక్రమంగా ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్న ప్లాట్ల మాఫియా. నకిలీ పత్రాలతో ప్రజలను మోసం చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసి కమిషన్లు దండుకుంటున్న వైనం. జోగులాంబ గద్వాల 13 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. అయిజ. మండలం ఉప్పల గ్రామంలో ప్లాట్ల మాఫియా రెచ్చిపోతోంది. గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 28/అ1 లో ఉన్న భూమి గతంలో దేవాదాయ శాఖకు సంబంధించిన ఇనాం భూమిగా ఉందని, అప్పట్లో దేవాలయ పూజారికి పూజా కార్యక్రమాలు, సేవల నిర్వహణ నిమిత్తం ఈ స్థలాన్ని కేటాయించినట్లు స్థానికంగా సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం...