రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

వాహనదారులకు స్పష్టమైన మార్గసూచికలు ఏర్పాటు చేయాలి బ్లాక్‌స్పాట్ల గుర్తింపు,లైటింగ్, పార్కింగ్,పెట్రోలింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జోగులంబ గద్వాల13 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేస్తూ, భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో జాతీయ...