ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..డీసీఎం డ్రైవర్ మృతి
ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొన్న డీసీఎం. సూర్యాపేట జిల్లా: మునగాల మండల కేంద్రంలోని జాతీయ రహదారి 65పై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని సూర్యాపేట వైపు వెళ్తున్న డీసీఎం వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద తీవ్రతకు క్యాబిన్ దెబ్బతినడంతో డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీయడం కష్టంగా మారింది. దీంతో పోలీసులు, గ్రామస్తులు కలిసి మృతదేహాన్ని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.