గోదావరి పుష్కరాల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక
భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేయాలి ఘాట్ల అభివృద్ధి, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, రహదారులు, వైద్య సదుపాయాల ఏర్పాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి గోదావరి పుష్కరాలు–2027ను దృష్టిలో ఉంచుకొని భద్రాచలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక రూపొందించి, అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐ డి ఓ సి కార్యాలయం లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్ల అభివృద్ధి తదితర అంశాలపై జిల్లా...