ఆ స్కూల్లో విద్యా వాలంటీరే టీచర్
జోగులాంబ గద్వాల 12 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఎర్రవల్లి. మండలం వల్లూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యా వాలంటీర్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించడం శోచనీయం. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు హెడ్మాస్టర్ లాంగ్ లీవ్ లో వెళ్ళగా ఉపాధ్యాయుడు సమావేశం ఉందని వెళ్లడంతో విద్యా వాలంటీర్ బోధన చేస్తూ ఒకటి నుండి ఐదు తరగతుల విద్యార్థులకు బోధించడం జరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సరైన ఉపాధ్యాయులు లేక విద్య అందడం లేదని ఇదే నిదర్శనం.