ఇటిక్యాల మండల బిజెపి పార్టీకార్యవర్గ సమావేశం
జోగులాంబ గద్వాల 12 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.ఇటిక్యాల . మండల అధ్యక్షుడు షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో ఉదండాపురం గ్రామంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తిమ్మారెడ్డి నివాసం వద్ద భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో మరింత విస్తృతంగా నిర్వహించడం, ప్రతి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం వంటి అంశాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ...