ఇంటర్ బోర్డు రద్దు

- తెలంగాణలో ఇంటర్మీడియట్‌కు ప్రత్యేక విధానం ఇక ఉండదు - 2027–28 విద్యా సంవత్సరం నుంచి 10+2 విధానం అమలు - ఇంటర్ విద్య పాఠశాల విద్యలో విలీనం.. - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్ న్యూస్ డెస్క్ : తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం 2027–28 నుంచి ప్రత్యేక ఇంటర్మీడియట్ విద్యా విధానానికి బదులుగా 10+2 విద్యా విధానాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జూనియర్ కళాశాలల ద్వారా నిర్వహిస్తున్న 11, 12వ తరగతులను పాఠశాల విద్యా వ్యవస్థలో విలీనం చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ...