మాజీ మంత్రి జగదీష్‌రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఆశా కార్యకర్తలు
సూర్యాపేట, నవంబర్ 12 : అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో పాటు ఆశా కార్యకర్తలను నిలువునా మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశా కార్యకర్తలు మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న నిరవధిక సమ్మె సందర్భంగా గురువారం మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి స్థానిక క్యాంపు కార్యాలయంలో సమ్మె నోటీసు, వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఆశా కార్యకర్తలు మూడేళ్ళుగా ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటే రేవంత్‌రెడ్డి మాత్రం ఆశాల చావు కోరుతున్నాడన్నారు. జీతాలు సక్కగా ఇవ్వడం చేతకాదు కానీ...