సూర్యాపేట జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలి
కరువు కోరల్లో రైతన్న.. నిద్రపోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువును జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువునిధులను వెంటనే విడుదల చేయాలి. సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపు ఎల్ నీ నో ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు ప్రభావంతో, వర్షాభావం, నీటి ఎద్దడి కారణంగా రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, వ్యవసాయం చేయలేని దుస్థితి ఏర్పడిందని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 200 మంది తో ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవో (A O) కి వినతి పత్రం...